Nomination : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్.. హాజరైన ప్రధాని మోదీ

Update: 2025-08-20 10:47 GMT

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు పలువురు అగ్ర నేతల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్డీఏ కూటమి కి సంబంధించినా కీలక నేతలందరూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే విధంగా ఇండియా కూటమి నుంచి తెలంగాణ కు చెందిన బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

Tags:    

Similar News