DEEP FAKE: డీప్ ఫేక్‌కు చెక్..!

డీప్‌ఫేక్ సమస్యతో భారత్ సతమతం.. సెలబ్రిటీల క్రేజ్‌తో కేటుగాళ్ల నేరాలు.. చెక్ పెట్టేందుకు కేంద్రం నయా రూల్స్

Update: 2025-10-25 06:30 GMT

సె­ల­బ్రి­టీల క్రే­జ్‌­ను క్యా­ష్ చే­సు­కుం­టూ కొం­ద­రు కే­టు­గా­ళ్లు ప్ర­జ­ల­ను మోసం చే­స్తు­న్నా­రు. ఏఐ టూ­ల్స్ ఉప­యో­గిం­చి ఫేక్ వీ­డి­యో­లు రూ­పొం­ది­స్తు­న్నా­రు. ఫేక్ ప్ర­మో­ష­న్లు వ్యా­ప్తి చేసి సా­మా­న్యుల జే­బు­ల­ను కొ­ల్ల­గొ­డు­తు­న్నా­రు. వీ­టి­ని డీప్ ఫేక్ వీ­డి­యో­లు అం­టా­రు. ఇవి ని­జ­మైన వీ­డి­యో­లు­గా కని­పి­స్తా­యి. కానీ పూ­ర్తి­గా ఫేక్. ఇలాం­టి వీ­డి­యో­లు చూసి చాలా మంది పె­ట్టు­బ­డు­లు పె­డు­తు­న్నా­రు. బె­ట్టిం­గ్‌­లు వే­స్తు­న్నా­రు. రూ. లక్ష­ల్లో నష్ట­పో­తు­న్నా­రు. ఇలాం­టి ఘట­న­లు రో­జు­రో­జు­కు పె­రు­గు­తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో­నే ఈ డీప్ ఫేక్ వీ­డి­యో­ల­ను అరి­క­ట్ట­డా­ని­కి కేం­ద్ర ప్ర­భు­త్వం కొ­త్త రూ­ల్స్ తీ­సు­కొ­స్తోం­ది.

ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకులు చెప్పని మాటలు చెబుతున్నట్టు కనిపించే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోలు కంప్యూటర్‌ లేదా మొబైల్ యాప్ తో తయారు చేసినవి. అచ్చం నిజం లాగా కనిపించే ఫేక్ కంటెంట్. ఇవి సామాన్యుల జీవితాలకు, సమాజానికి హాని చేస్తున్నాయి.

కొత్త రూల్స్ ఏమిటి?

డీఫ్ ఫేక్ కం­టెం­ట్‌­ను అరి­క­ట్టేం­దు­కు ఎల­క్ట్రా­ని­క్స్ అండ్ ఇన్ఫ­ర్మే­ష­న్ టె­క్నా­ల­జీ మం­త్రి­త్వ శాఖ కొ­త్త డ్రా­ఫ్ట్ రూ­ల్స్ జారీ చే­సిం­ది. వా­ట్సా­ప్, ఫే­స్‌­బు­క్, ఇన్‌­స్టా­గ్రా­మ్, యూ­ట్యూ­బ్ వంటి సో­ష­ల్ మీ­డి­యా ప్లా­ట్‌­ఫా­‌­మ్‌­ల­లో AIతో తయా­రైన వీ­డి­యో­లు, ఫో­టో­ల­పై స్ప­ష్ట­మైన లే­బు­ల్ ఉం­డా­లి. ఇది స్క్రీ­న్‌­లో కనీ­సం 10 శాతం స్పే­స్ కవర్ చే­స్తూ.. ఇది AIతో తయా­రైం­ద­ని చూ­పిం­చా­లి. ఈ లే­బు­ల్‌­ను తొ­ల­గిం­చ­డా­ని­కి వీలు లే­కుం­డా ఉం­డా­లి. యూ­జ­ర్లు ఫేక్ కం­టెం­ట్ అప్‌­లో­డ్ చే­స్తే, అది AI తయా­రైం­ద­ని చె­ప్పా­లి. సో­ష­ల్ మీ­డి­యా కం­పె­నీ­లు ఆటో­మే­టె­డ్ టూ­ల్స్‌­తో ఫేక్ కం­టెం­ట్‌­ను కని­పె­ట్టా­లి.

కోర్టుకు వెళ్తున్న సెలబ్రిటీలు

నా­గా­ర్జున, అక్ష­య్ కు­మా­ర్, రష్మి­కా మం­ద­న్నా, కరణ్ జో­హా­ర్ వంటి సె­ల­బ్రి­టీ­లు తమ ఫేక్ వీ­డి­యో­ల­పై ఇప్ప­టి­కే కో­ర్టు­కు వె­ళ్లా­రు. తమ ప్ర­మే­యం లే­కుం­డా­నే డీఫ్ ఫేక్ వీ­డి­యో­లు తయా­ర­య్యా­యి. సో­ష­ల్ మీ­డి­యా­లో వే­గం­గా వ్యా­ప్తి చెం­దా­యి. ఒక సర్వే ప్ర­కా­రం.. 62 శాతం పె­ద్ద కం­పె­నీ­లు తమ ఎగ్జి­క్యూ­టి­వ్‌ల డీ­ప్‌­ఫే­క్ దా­డు­ల­ను ఎదు­ర్కొ­న్నా­యి. భా­ర­త్‌­లో దా­దా­పు 100 కో­ట్ల మంది ఆన్‌­లై­న్‌ యూ­జ­ర్లు­న్నా­రు. ఫేక్ కం­టెం­ట్ కా­ర్చి­చ్చు­లా వ్యా­పి­స్తోం­ది. ఎన్ని­క­లు, పం­డు­గల సమ­యం­లో ఇవి హిం­స­కు కూడా దా­రి­తీ­స్తా­యి. ప్ర­భు­త్వం AI టె­క్నా­ల­జీ­ని అను­మ­తి­స్తూ­నే, ప్ర­జ­ల­ను మోసం నుం­చి కా­పా­డా­ల­ని చూ­స్తోం­ది.

మార్పు మొదలైనట్లే..

తా­జా­గా కేం­ద్రం తీ­సు­కో­చ్చిన ఈ రూ­ల్స్ ఆన్‌­లై­న్ కం­టెం­ట్‌­లో పా­ర­ద­ర్శ­కత తె­స్తా­యి. ప్ర­జ­లు తాము చూసే వీ­డి­యో­లు అస­లు­వే­నా లేదా ఫేకా అని తె­లు­సు­కు­ని సరైన ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వ­చ్చు. కానీ, గూ­గు­ల్, మెటా వంటి పె­ద్ద కం­పె­నీ­ల­తో పాటు చి­న్న ప్లా­ట్‌­ఫా­ర­మ్‌­లు ఈ రూ­ల్స్‌­ను ఏమే­ర­కు అమలు చే­స్తా­య­నే­ది చాలా కీ­ల­కం. అయి­తే ఈ ఈ రూ­ల్స్ ఇంకా డ్రా­ఫ్ట్ దశలో ఉన్నా­యి. చట్టం కా­లే­దు. 2025 ప్ర­జ­లు నవం­బ­ర్ 6 వరకు తమ అభి­ప్రా­యా­లు చె­ప్ప­వ­చ్చు. ఆ తర్వాత ఇవి చట్టం­గా మా­రొ­చ్చు. డీ­ప్‌­ఫే­క్ సమ­స్య­ను తీ­వ్రం­గా తీ­సు­కు­న్న తొలి దే­శా­ల్లో భా­ర­త్ ఒకటి. చైనా, యూ­రో­పి­య­న్ యూ­ని­య­న్‌­లో ఇలాం­టి రూ­ల్స్ ఉన్నా­యి. కానీ ఇంత సమ­గ్రం­గా లేవు.

Tags:    

Similar News