మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ (76) యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటు న్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన అభిప్రా యాన్ని తెలుపుతూ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కు లేఖ రాశారు. పదవిలో తనను గౌరవించి, మద్దతు తెలిపిన ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాగా 10 ఏళ్లుగా తాను శాహదారా ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్ గా తన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించానని చెప్పుకొచ్చారు. తనపై కేజ్రివాల్ చూపుతున్న గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. వయస్సు కారణంగానే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటున్నానని వెల్లడించారు. పూర్తి అంకిత భావంతో ఎప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేస్తుంటానని తెలిపారు. తనకు అప్పగించిన ఏపనినైనా బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు.