కంటతడి పెట్టిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. విద్యా రంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను.. పడిన కష్టాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు;
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. విద్యా రంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను.. పడిన కష్టాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌లెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి.. జైలులో పెట్టించిందని ఆరోపించారు. ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే జైలులో పెట్టించేది కాదన్నారు. విద్యా రంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారని.. అయితే.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు తాము తెరపడనీయమని పేర్కొన్నారు. ఢిల్లీ విద్యా రంగంలో సిసోడియా చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.