Rekha Gupta: ఢిల్లీలో ఏడాది పాలన పూర్తి.. రిపోర్ట్ కార్డు విడుదల చేసిన సీఎం రేఖా గుప్తా

అభివృద్ధితో చరిత్ర మార్చామన్న ముఖ్యమంత్రి

Update: 2026-02-20 06:45 GMT

గత ప్రభుత్వం మాటలు చెబితే.. మా ప్రభుత్వం పని చేసి చేతల్లో చూపించిందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడి ఫిబ్రవరి 20న ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో సెక్రటేరియట్‌లో రేఖా గుప్తా రిపోర్ట్ కార్డు విడుదల చేశారు. ఆరోగ్యం, యమునా నది శుభ్రపరచడం, పెట్టుబడి, విద్య రంగాల్లో విజయాలు సాధించినట్లుగా పేర్కొన్నారు.

‘‘మేము సాకుల నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లాం. ఢిల్లీ పని సంస్కృతిని మార్చాం. గత ప్రభుత్వం శబ్దం చేసేది.. మా ప్రభుత్వం పనిచేస్తుంది. మేము ఢిల్లీలో ‘నేను’ కాదు.. ‘మేము’ అనే రాజకీయాలుచేస్తున్నాము.’’ అని అన్నారు. ఏడాదిలో 30 వేలకు పైగా ఆయుష్మాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఢిల్లీలో 370 కొత్త ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. అవినీతిని అరికట్టడానికి వ్యవస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేశామని.. మురికివాడల నివాసితులకు శాశ్వత గృహాలను అందిస్తామని ఇచ్చిన హామీ నెరవేరిందని పేర్కొన్నారు.

గతేడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని బీజేపీ కలిపించింది. ఇక ప్రజా దర్భార్ నిర్వహిస్తుండగా ఓ జంతు ప్రేమికుడు రేఖా గుప్తాపై దాడి చేశారు.

Tags:    

Similar News