షనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ విచారణ సమయంలో వాదనలు వింటామని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణ ను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై 2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచార ణకు స్వీకరించిన తర్వాత ఈడీ ఇటీవలే చార్జి షీట్ దాఖలుచేసింది. అసోసియే టెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రూ. 2 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న ట్టు ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో మని ల్యాండరింగ్ జరిగినట్టు ఈడీ తెలిపింది.