Delhi excise policy case: మనీష్ సిసోడియా భౌతిక హాజరు కావాలన్న కోర్టు
అవసరం అయితే కోర్టులో భద్రత పెంచుకోవాలని సూచన;
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇకపై కోర్టు కు భౌతికంగా హాజరు పరచాలని ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు మనీష్ సిసోడియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హియరింగ్ తీసుకొచ్చిన సందర్భంగా స్పెషల్ జడ్జ్ నాగపాల్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. పార్టీలకు చెందిన ఇతర వ్యక్తులను, అనుమానితులను ఎవరిని కోర్టులోకి రానివ్వకుండా చేసి కట్టుదిట్టం అయిన భద్రతా చర్యలు తీసుకొనిమనీష్ ను కోర్టు ముందుకు రావచ్చన్నారు.
మరోవైపు మద్యం పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు నిన్న కొట్టి వేసింది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలోనూ పలుమార్లు సిసోడియా బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను తొలిసారిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. తీహార్ జైలులో గంటల తరబడి విచారించిన తర్వాత మార్చి 9న ఇదే కేసులో మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఆయన భార్య అస్వస్థతకు గురి అవ్వుతుండటంతో పలుమార్లు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తనకు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా హైకోర్టులో అప్పీల్ చేశారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కావున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఆప్ ప్రభుత్వం నవంబర్ 2021లో అమలులోకి తెచ్చింది. అవినీతి ఆరోపణల మధ్య గత ఏడాది సెప్టెంబర్ చివరిలో ఇది రద్దు చేయబడింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుల్లో మనీష్ సిసోడియా నిందితుడియా ఉన్నారు.