Delhi Murder: కత్తెరతో భార్య, అత్త హత్య , దేశ రాజధానిలో ఘోరం

కుమార్తె పుట్టినరోజు బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం

Update: 2025-08-31 00:30 GMT

ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రోహిణిలోని సెక్టార్ 17లో యోగేష్ సెహగల్ అనే వ్యక్తి తన భార్య ప్రియ(27), అత్త కుసుమ్ సిన్హా (63), కుతూరుతో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో కుమార్తె పుట్టిన రోజున వచ్చిన బహుమతుల విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. అలాగే వారి మధ్య గృహ వివాదం కూడా చోటుచేసుకుంది. దీంతో నిందితుడు యోగేష్ తన భార్య, అత్తగారిపై కత్తెరతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోయాడు. వెంటనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారించిన తర్వాతే హత్య వెనుక అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News