Baby Kidnapped: ఢిల్లీలో ఆరు నెలల చిన్నారి కిడ్నాప్..మూడ్రోజుల్లో గుర్తింపు
చిన్నారిని కిడ్నాప్ చేసి 90వేలకు ఆస్పత్రి సిబ్బందికి అమ్మకం;
రోజురోజుకు కొందరు దుర్మార్గులు పసికందులను, చిన్నారులను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారు. వీరికి కొందరు వ్యక్తులతో పాటు ఆస్పత్రుల సిబ్బంది కూడా వారికి సాయం చేస్తున్నారు. చిన్నారుల కిడ్నాప్ లు ఇప్పటికే చాలానే జరిగాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో మరో చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు చిన్నారిని కిడ్నాప్ చేసి 90వేలకు ఆస్పత్రి సిబ్బందికి అమ్మేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఒక దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సరాయ్ కాలే ఖాన్ బస్ స్టాండ్ దగ్గర ఓ జంటకు చెందిన ఆరు నెలల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ చిన్నారిని ఫతేహాబాద్‌కు తీసుకువచ్చి 90 వేల రూపాయలకు ఆసుపత్రి సిబ్బందికి అమ్మేశాడు. చిన్నారి కనబడడం లేదని ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ టీవీ పరిశీలించగా పినాహత్‌లోని నయాపురా నివాసి వీర్భన్ అలియాస్ వీరు సింగ్ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరు సింగ్, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు సింగ్ చెప్పిన వివరాలతో ఆసుపత్రి ఆపరేటర్, డాక్టర్, నర్సును అరెస్టు చేశారు. వారి నుంచి చిన్నారి రక్షించి.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. వీరు సింగ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుడికి ఏదైనా పిల్లల దొంగతనాల ముఠాతో సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.