ట్రెడ్‌మిల్‌పై వాక్ చేస్తూ కరెంట్ షాక్ తో..
టైమ్ బావుండకపోతే కర్రే పామై కరుస్తుంది అని పెద్దలు ఊరికే అనలేదు..
టైమ్ బావుండకపోతే కర్రే పామై కరుస్తుంది అని పెద్దలు ఊరికే అనలేదు.. మృత్యుగడియలు సమీపిస్తే ఏదో ఒక రూపంలో పట్టుకుపోతుంది. పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు..జీవితంలోని ఆనందానుభూతులను చవిచూడనే లేదు.
గురుగ్రామ్‌కు చెందిన ఒక సంస్థలో పనిచేస్తున్న పృతీ, ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోన ఉన్న సెక్టార్ 15లోని జింప్లెక్స్ ఫిట్‌నెస్ జోన్ లో వర్కవుట్లు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ట్రెడ్ మిల్ పై నడుస్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి కరెంట్ షాక్ తగిలి ముందుకు పడిపోయాడు.. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.
మంగళవారం ఉదయం జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు. విద్యుదాఘాతమే మరణానికి కారణమని పోస్ట్‌మార్టంలో నిర్ధారించినట్లు నివేదికలు వెలువడ్డాయి.
యంత్రాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జిమ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.