Revanth Reddy : రాజ్‌నాథ్ సింగ్‌తో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ

Update: 2025-09-10 11:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 10, 2025న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రక్షణ శాఖ భూములను కేటాయించాలని ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.మూసీ, ఈసీ నదుల సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులో 'గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు చిహ్నంగా నిలుస్తుందని వివరించారు.ఈ భేటీలో రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టబోయే కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన కోరారు.

Tags:    

Similar News