Delhi : ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ రాజీనామా..
Delhi : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు;
Delhi : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కొందరు హిందు దేవతలను బహిష్కరిస్తూ ప్రమాణం చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనిపై వివాదం చెలరేగడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత వివాదంపై స్పందించిన రాజేంద్ర పాల్...బీజేపీ తనను, పార్టీని అవమానించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయాన్ని బీజేపీయే వివాదంగా మార్చిందన్నారు.