పైలెట్ దంపతులు పదేళ్ల బాలికను పనిలో పెట్టుకుని శారీరకంగా.. ఆగ్రహించిన స్థానికులు
చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటారు.. లక్షల్లో జీతాలు సంపాదిస్తుంటారు. అయినా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు..
చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటారు.. లక్షల్లో జీతాలు సంపాదిస్తుంటారు. అయినా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు.. పదేళ్ల బాలికను పనిలో పెట్టుకోవడమే తప్పంటే.. అభం శుభం తెలియని ఆ చిన్నారిని నానా చిత్రహింసలకు గురి చేసి నరకయాతన అనుభవించేలా చేసింది ఓ మహిళా పైలెట్.. ఆమెకు తోడు భర్త కూడా ఆ బాలికను శారీరకంగా హింసించేవాడు.. ఇది తెలిసిన స్థానికులు పైలెట్ ని, ఆమె భర్తని నడిరోడ్డు మీద జుట్టు పట్టుకుని చితకబాదారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని ద్వారకలో బుధవారం నాడు ఒక పైలట్ మరియు ఆమె భర్తను స్థానికులు చితకబాదారు. పైలట్ భర్త ఒక ఎయిర్‌లైన్‌లో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగి. దంపతులు రెండు నెలల క్రితం మైనర్ బాలికను ఇంటిలో పనికి కుదుర్చుకున్నారు. ఆ రోజు నుంచి బాలికకు నరకం చూపించారు దంపతులు ఇరువురు. బాలిక ముఖం, శరీరంపై అనేక గాయాల గుర్తులను గమనించిన బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాల కార్మికులు, శారీరక వేధింపులు, మైనర్‌ను బెదిరించడం వంటి ఆరోపణలపై భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు. పదేళ్ల బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు.