Israel Hamas War: ఢిల్లీ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం భద్రత కట్టుదిట్టం
ఇజ్రాయెల్‌కు మద్దతుగా.. నీలం రంగులోకి మారిపోయిన అధ్యక్షుల భవనాలు;
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసాల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఈ నేపథ్యంలో ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని చాబాద్ హౌస్ చుట్టూ చాబాద్ హౌస్ చుట్టూ భద్రతను పెంచినట్లు అధికారి తెలిపారు. ఇది కాకుండా న్యూఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని యూదుల మత స్థలం చాబాద్ హౌస్ దగ్గర కూడా భద్రతను పెంచారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ యోధుల దాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి తర్వాత మరణించిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తోంది. దీనితో పాటు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఉక్రెయిన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా సహా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో ఇజ్రాయెల్‌తో పాటు నిలబడాలని మాట్లాడాయి. పాలస్తీనా తీవ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిలో వందలాది మంది ఇజ్రాయిలీలు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భీకరమైన ప్రతీకార చర్యలో, గాజా స్ట్రిప్ ప్రాంతంలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. వందల మంది ఇతరులు గాయపడ్డారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఇండియా, స్పెయిన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా నిలవగా, లెబనాన్, పాకిస్థాన్, ఇరాన్ వంటి దేశాలు పాలస్తీనా ముసుగులో హమాస్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాకు మద్దతుగా వివిధ దేశాల్లో కూడా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆయా దేశాల అధినేతల భవనాలు, చారిత్రక కట్టడాలపై తెలుపు, నీలం రంగులను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ , న్యూయార్క్‌లోని ది ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్, యూకే పార్లమెంట్ ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్ సహా చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్ జెండాను, ఆ దేశ జెండా రంగులైన నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.