Air Pollution : ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత..
అయినా ఇంకా రెండవ కేటగిరీలోనే వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం కాస్త మెరుగుపడింది. అయినప్పటికీ వెరీ పూర్ కేటగిరీ లోనే ఉంది. ఢిల్లీలో ఆదివారం ఏక్యూఐ లెవెల్స్ 377గా నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ 319కి తగ్గింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. సోమవారం ఉదయం ఢిల్లీలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 319గా నమోదైంది. అత్యధికంగా వజీర్‌పూర్‌లో 385, నరేలాలో 382గా ఏక్యూఐ నమోదైంది. ఇక రాజధానిలోని 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో చాలా వరకూ ఏక్యూఐ లెవెల్స్ వెరీ పూర్ కేటగిరీలోనే ఉంది. ద్వారకా ప్రాంతంలో 259, లోధి రోడ్డులో 210, ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో 242, ఐజీఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద 285తో ఏక్యూఐ పూర్ కేటగిరీలో ఉంది. ఇక ఐటీవో ప్రాంతంలో గాలి నాణ్యత సంతృప్తికరంగా నమోదైంది. అక్కడ ఏక్యూఐ 99గా ఉంది. నవంబర్ 4 వరకూ రాజధానిలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలోనే ఉండే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (AQEWS) తెలిపింది.