Mumbai: బిల్డింగ్ లిఫ్ట్‌లో డెలివరీ బాయ్ మూత్ర విసర్జన..

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు;

Update: 2025-07-22 04:45 GMT

ముంబైలోని విరార్ వెస్ట్‌లో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఇ-కామర్స్ డెలివరీ సంస్థ బ్లింకిట్ కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్‌ బిల్డింగ్‌ లోని లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఏదో భరించలేని వాసన రావడంతో.. అక్కడి నివాసితులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బ్లింకిట్ జాకెట్‌ ధరించిన వ్యక్తి ఓ పార్సిల్ పట్టుకుని లిఫ్ట్‌లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ తర్వాత అతను తన ప్యాంట్ జిప్ తీసి, వెనక భాగాన ఉన్న కెమెరాకు కనిపించకుండా ఉండేందుకు ఓ మూలకు వెళ్లి, లిఫ్ట్ వాకిళ్లపై మూత్రవిసర్జన చేశాడు.

ఈ వీడియోను చూసిన తర్వాత బిల్డింగ్ నివాసితులు బ్లింకిట్ ఆఫీసుకు వెళ్లి ఆ డెలివరీ బాయ్‌ను గుర్తించారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై రెసిడెంట్స్ దాడి చేసినట్లు సమాచారం. అంతేకాదండోయ్.. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్‌ ను విరార్ వెస్ట్‌ లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి అసభ్య ప్రవర్తనతో కంపెనీల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం తగ్గుతోందని పలువురు విమర్శిస్తున్నారు. డెలివరీ సంస్థలు తమ సిబ్బందిపై పర్యవేక్షణను మరింత కఠినంగా మార్చాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై బ్లింకిట్ సంస్థ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags:    

Similar News