Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్.. పంజాబ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం..

Dera Baba: గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ అలియాస్‌ డేరాబాబాకు సెలవులు ఇచ్చారు.

Update: 2022-02-08 04:47 GMT

Dera Baba (tv5news.in)

Dera Baba: గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ అలియాస్‌ డేరాబాబాకు సెలవులు ఇచ్చారు. భారీ భద్రతతో నిన్న జైలు నుంచి బయటికొచ్చాడు. అది కూడా పంజాబ్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ పెరోల్‌పై బయటకు తీసుకొచ్చారు. డేరా బాబా రాకతో రాజకీయ సమీకరణాలు మారతాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆడవాళ్లపై ఎన్నో అఘాయిత్యాలు చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలామందికి ఆరాధ్యుడే. పైగా పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో డేరాబాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు.

పంజాబ్‌ ఎన్నికల ముందు.. 21 రోజుల సెలవులతో పెరోల్‌పై రావడం చర్చనీయాంశం అయింది. పంజాబ్‌ ఎన్నికలపై డేరాబాబా ప్రభావం కచ్చితంగా ఉంటుందంటున్నారు. పంజాబ్‌లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలపై డేరాబాబా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లోని బఠిండా, సంగ్రూర్‌, పాటియాలా, ముక్త్‌సర్‌ ప్రాంతాల్లో డేరాబాబా ప్రభావం ఉంటుంది.

గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ డేరా ప్రభావం కనిపించింది. పంజాబ్‌లో దాదాపు 300 డేరాలు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల్లో డేరాల మద్దతు లభిస్తే ఆ పార్టీలకు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు దక్కే అవకాశం ఉంది. అయితే, ఎన్నికలకు ముందు ఆయన విడుదల కావడం యాదృచ్ఛికమేనని హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చెప్పుకొచ్చారు. మూడేళ్ల జైలు శిక్ష తర్వాత ఎవరికైనా సెలవులు వస్తాయని చెప్పారు. అంతే తప్ప డేరా బాబా విడుదలకు ఎన్నికలతో సంబంధం లేదంటూ స్పష్టం చేశారు.

Tags:    

Similar News