Congress President Elections : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో ముందున్న దిగ్విజయ్ సింగ్..
Congress President Elections : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దిగ్విజయ్‌సింగ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది;
Congress President Elections : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దిగ్విజయ్‌సింగ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన రేపు నామినేషన్ వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవమయ్యే అవకాశముంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే రాజస్థాన్‌లో పరిణామాల నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించాలనే కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో గెహ్లాట్‌ను అధ్యక్ష రేసు నుంచి పక్కకు తప్పించినట్లు సమాచారం.
గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు... అధ్యక్షురాలు సోనియాని కోరినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. సోనియా ఆదేశాలతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగ్విజయ్ సిద్ధమయ్యారు. గురువారం ఆయన నామినేషన్ వేయనున్నారు.
ఆయన ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు ముందే వినిపించింది. అయితే ఆ పదవిపై ఆసక్తిగా లేదంటూ తోసిపుచ్చారు దిగ్విజయ్. ఇప్పుడు హైకమాండ్ దాదాపుగా ఆయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి దిగ్విజయ్ సింగ్ అత్యంత నమ్మకస్తుడు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సుధీర్ఘ అనుభవం ఉంది. దీంతో దిగ్విజయ్సింగ్నే ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ హైకమాండ్.