AICC : ఏఐసీసీ ప్రెసిడెంట్ రేసులో దిగ్విజయ్ సింగ్.. రేపే నామినేషన్ దాఖలు..

AICC : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులోకి దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చారు;

Update: 2022-09-29 09:55 GMT

AICC : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులోకి దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చారు. ఇవాళ ఢిల్లీ వచ్చిన అయన ఏఐసీసీ ఆఫీస్‌లో నామినషన్‌ పేపర్లను తీసుకున్నారు.. రేపు నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. అయితే అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది దిగ్విజయ్‌..వ్యక్తిగత నిర్ణయమని ఇందులోపార్టీ నాయకత్వం ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇచ్చాయి ఏఐసీసీ వర్గాలు.మరోవైపు ఇప్పటికే బరిలో ఉన్న శశీ థరూర్‌ కూడా రేపు తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు.

సోనియాను కలిశారు అశోక్‌ గెహ్లోట్‌ రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలు అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరిపారు .మరోవైపు సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కూడా అధ్యక్ష పదవి రేసుకు సిద్ధమంటూ సిగ్నల్‌ ఇస్తున్నారు. మరోపక్క అధ్యక్ష బరిలో తాను లేనని కమల్‌నాథ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆసక్తికరంగా మారిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.

Tags:    

Similar News