ప్రధాని నరేంద్ర మోదీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించారు. త్రివిధ దళాధిపతులతో కూడా డోభాల్ భేటీ అయినట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొంటున్న దాడుల నేపథ్యంలో డోభాల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ వరుస దాడులకు తెగబడుతోంది. జమ్మూ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్స్ కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి దాయాది దేశం కవ్వింపులకు పాల్పడుతున్నప్పటికీ భారత బలగాలు వాటిని గట్టిగా తిప్పికొడుతున్నాయని తెలిపారు.