Chhattisgarh: మానవత్వం చాటుకున్న డీఆర్‌జీ జవాన్లు.. గర్భిణిని మంచంపై మోసుకెళ్లి..
Chhattisgarh: దంతెవాడ జిల్లా రేవాలి గ్రామంలో నిండు గర్భిణిని మంచం మీద మోసుకు వెళ్లి తల్లీ బిడ్డలను కాపాడారు.;
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో డీఆర్‌జీ జవాన్లు మానవత్వం చాటుకున్నారు.. దంతెవాడ జిల్లా రేవాలి గ్రామంలో నిండు గర్భిణిని మంచం మీద మోసుకు వెళ్లి తల్లీ బిడ్డలను కాపాడారు.. రేవాలి గ్రామంలో మావోయిస్టులు రోడ్లను ధ్వంసం చేశారు.. దీంతో రోడ్డు మార్గం మొత్తం ధ్వంసమైంది.. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.. ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు..
అయితే, గ్రామంలో రోడ్డు మార్గం ధ్వంసం కావడంతో అంబులెన్స్ రాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.. ఈ ఉదంతాన్ని చూసి చలించిపోయిన డీఆర్‌జీ జవాన్లు.. వెంటనే ఆమెను మంచం మీద మెయిన్ రోడ్డు వరకు మోసుకెళ్లారు.. అనంతరం వారి పెట్రోలింగ్ వాహనంలో హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు.. అక్కడే మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.