తాగునీరు కలుషితం.. 200 మందికి తీవ్ర అస్వస్థత

ఘజియాబాద్‌లోని సయా గోల్డ్ సొసైటీలో కలుషిత నీరు తాగి 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.;

Update: 2024-05-04 04:56 GMT

ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఉన్న సాయా గోల్డ్ సొసైటీలో శుక్రవారం 200 మందికి పైగా ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. దీనికి కారణం మురికి నీరు. చాలా రోజులుగా తాగునీరులో మురుగునీరు కలుస్తోందని, ప్రజలు ఆ నీటిని తాగడంతో 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని సొసైటీ ప్రజలు వాపోయారు.

తరచూ సొసైటీలోని ప్రజలు ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారో మొదట్లో తెలియకపోగా, తర్వాత సమాచారం ఆరా తీస్తే కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైనట్లు తేలింది.

ఆరోగ్య శాఖ బృందం సొసైటీకి చేరుకుంది. చిన్నారులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నారని ప్రజలు తెలిపారు. సొసైటీలో 1500కు పైగా ఫ్లాట్లు ఉన్నాయి. 

Tags:    

Similar News