నటి రాగిణి ద్వివేది అరెస్టుతో... డ్రగ్స్ రాకెట్‌లో మరింతమంది పేర్లు..!
బెంగళూరు డ్రగ్స్ కేసు... ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. నటి రాగిణి ద్వివేది అరెస్టుతో..;
బెంగళూరు డ్రగ్స్ కేసు... ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. నటి రాగిణి ద్వివేది అరెస్టుతో... డ్రగ్స్ రాకెట్‌లో మరింతమంది పేర్లు బయటికి రానున్నాయి. శాండల్‌వుడ్‌లోనే ఇది అత్యంత దారుణమైన ఘటనగా పలువురు నటులు అభివర్ణిస్తున్నారు. రాగిణి ద్వివేది ఫ్రెండ్ రవిశంకర్, విరేన్ ఖన్నాల అరెస్టు తర్వాత.. ఆమెను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిశంకర్‌కు... హై ప్రొఫైల్ పార్టీలు నిర్వహించే వ్యక్తిగా శాండల్‌వుడ్‌లో పేరుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారి జాబితాను... జర్నలిస్ట్, డైరెక్టర్ అయిన ఇంద్రజిత్ ఇచ్చిన తర్వాత.. సీసీబీ వాళ్లపై దృష్టిపెట్టింది. ఈ జాబితాలో 15 మంది ప్రముఖుల పేర్లు ఉండటం కలకలం సృష్టిస్తోంది.