దేశవ్యాప్తంగా దసరా సందడి

దేశవ్యాప్తంగా దసరా సందడి ఉంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో నివసించే వాళ్లు... స్వస్థలాలకు తరలివెళ్లారు. గ్రామగ్రామాన దసరా..

Update: 2020-10-25 06:08 GMT

దేశవ్యాప్తంగా దసరా సందడి ఉంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో నివసించే వాళ్లు... స్వస్థలాలకు తరలివెళ్లారు. గ్రామగ్రామాన దసరా వైభవం ఉట్టిపడుతోంది. జమ్మి చెట్టు, ఆయుధపూజ, పాలపిట్ట దర్శనాలు, ఆత్మీయుల ఆలింగాలతో ప్రేమానురాగాలు వెల్లివిరుస్తున్నాయి. రావణవధ, మహిశాసుర వధకు ప్లలె,పట్నం అనే తేడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రకాల పురాణ, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దసరాను చెడుపై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా జరుపుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

దసరా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది... కర్నాటకలోని మైసూర్‌ చాముండేశ్వరి ఆలయంం. ఇక్కడ నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ సారి కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజా ప్యాలెస్‌ను దసరా సందర్భంగా ఆనవాయితీ ప్రకారం లక్ష విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో విభిన్న తరహాలోనే నిర్వహించుకునే దసరా అంటే చాలా మందికి ప్రీతిపాత్రమైన పండుగ. అందుకే ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు తరలివెళ్తున్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ కనిపిస్తోంది.

Tags:    

Similar News