అన్నా డీఎంకేలో సంక్షోభానికి తెరపడింది. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించింది అన్నాడీఎంకే. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం... సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే.... అన్నా డీఎంకే చీఫ్ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఒక కమిటీని నియమించారు. కమిటీ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వం ఉన్నారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 11 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై ఈపీఎస్, ఓపీఎస్ ఉమ్మడి ప్రకటన చేశారు.