Earthquake: అఫ్గాన్‌లో భూకంపం.. వణికిన ఢిల్లీ

అఫ్గానిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం... ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లోనూ ప్రకంపలను.. ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారుల ప్రకటన

Update: 2023-08-06 02:30 GMT

అఫ్గానిస్థాన్‌( Afghanistan )లోని హిందూ కుష్ పర్వత ప్రాంతం(Hindu Kush region )లో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం‍(earthquake of 5.8 magnitude‌).. భారత్‌ను కూడా వణికించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగున్న ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశం(north India)లోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా జమ్ముకశ్మీర్(Jammu and Kashmir), పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ డైరెక్టర్ వెల్లడించారు. పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది. ఎక్కడా ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

అఫ్గానిస్థాన్‌లోని హిందు కుశ్‌ ప్రాంతంలో రాత్రి 9.31 గంటలకు మొదటగా భూకంపం వచ్చింది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ఈ ప్రకంపనలకు లోనయ్యారు. నొయిడాలోని ఎత్తైన భవంతుల్లో ఉన్నవారికీ ఇది అనుభవమైంది.


భూప్రకంపనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పందించారు. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు వచ్చాయని. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలారా మీరందరూ క్షేమంగా ఉన్నారని తాము ఆశిస్తున్నామని, ఏదైనా అత్యవసర సహాయం కోసం 112కు డయల్ చేయాలని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు.

అఫ్గనిస్థాన్‌లో తరుచుగా భూకంపాలు సంభవిస్తాయి. ముఖ్యంగా యురేషియన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణులు భూకంపాల జోన్‌లో ఉన్నాయి. 

Tags:    

Similar News