Amartya sen: ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్

Amartya Sen : ప్రముఖ ఆర్థికవేత్త నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కరోనా బారిన పడ్డారు.;

Update: 2022-07-09 15:27 GMT

Amartya Sen : ప్రముఖ ఆర్థికవేత్త నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కరోనా బారిన పడ్డారు. 89 ఏళ్ల ఆయన ఆర్థిక శాస్త్రం, సామాజిక న్యాయం లాంటి ఎన్నో రంగాల్లో విశేష సేవలందించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ బిర్బుబమ్ జిల్లాలోని బోల్పూర్ శాంతీనికేతన్ నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

కరోనా కారణంగా రెండేళ్ల తరువాత ఆయన జులై 1న భారత్‌కు వచ్చారు. కానీ ఇంతలోనే అమర్య్తసేన్‌కు కరోనా సోకింది. జులై 10న ఆయన లండన్‌కు తిరిగి ప్రయాణం కావలసి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆశించారు. 

Tags:    

Similar News