Arvind Kejriwal: ఈడీ సమన్లు.. తొమ్మిదోస్సారి

మార్చి 21న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Update: 2024-03-17 05:15 GMT

 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీచేయడం ఇది తొమ్మిదోసారి. గత ఎనిమిది నోటీసులకు స్పందించని ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది.

మద్యం పాలసీ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు ఇప్పటివరకూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే వాటిని ఆయన తిరస్కరించారు. దీంతో కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది.

చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కవిత అరెస్టుతో స్వయంగా హాజరవ్వాలని కేజ్రీవాల్‌ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు రూ.15,000 బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలా జరుగుతుండగానే  తాజాగా మరోసారి సమన్లు జారీచేయడం గమనార్హం. ఇదే మద్యం పాలసీ’ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News