CBN: నూతన గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా అవతరిస్తోన్న అమరావతి

ఆర్థిక సర్వేలో ప్రాధాన్య నగరంగా అమరావతి

Update: 2026-01-31 05:30 GMT

అమరావతిను భవిష్యత్ భారత అవసరాలకు తగిన విధంగా నూతన గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో అమరావతిని ప్రాధాన్య నగరంగా పేర్కొనడం రాష్ట్రానికి లభించిన కీలక గుర్తింపని ఆయన వ్యాఖ్యానించారు. దేశం వేగంగా ఆర్థిక పురోగతి దిశగా సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2038 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. అలాగే 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.

విస్తృత ప్రణాళికతోనే...

రాజధాని నిర్మాణంపై గతంలో అనేక విమర్శలు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. “రాజధానికి అంత భూమి ఎందుకు? వంద ఎకరాల్లోనే సచివాలయం కట్టొచ్చుగా” అని చాలామంది ప్రశ్నించారని తెలిపారు. అయితే ఒక రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలంటే, అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందాలంటే విస్తృత ప్రణాళికతో రాజధాని నిర్మాణం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల రాజధానులను ఉదాహరణగా పేర్కొంటూ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ వంటి బలమైన నగరాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అమరావతిని చిన్న నగరంగా పరిమితం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే హైదరాబాద్‌ కంటే మెరుగైన మౌలిక సదుపాయాలతో, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గత 30 ఏళ్లలో ప్రపంచం ఎంతో వేగంగా మారిందని, సాంకేతికత, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సీఎం తెలిపారు. ఈ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర రాజధానిని ఆధునికంగా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఆర్థిక, విద్య, వైద్య, సాంకేతిక రంగాలకు కేంద్రంగా మారుతుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్న సీఎం

భవి­ష్య­త్ భా­ర­త­దే­శం ఎలా ఉం­డ­బో­తోం­ద­నే అం­శం­పై వి­ద్యా­ర్థు­లు కూడా అవ­గా­హన పెం­చు­కో­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. చి­త్తూ­రు జి­ల్లా గు­డు­ప­ల్లి మం­డ­లం­లో అగ­స్త్య వి­ద్యా­చ­ల్‌ అకా­డ­మీ ప్రాం­గ­ణం­లో నూ­త­నం­గా ఏర్పా­టు చే­సిన టీ­చ­ర్ల ట్రై­నిం­గ్ సెం­ట­ర్‌­ను ము­ఖ్య­మం­త్రి ప్రా­రం­భిం­చా­రు. రూ.3 కో­ట్ల వ్య­యం­తో 11 వేల చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో ఈ ట్రై­నిం­గ్ సెం­ట­ర్ ఏర్పా­టు చే­శా­రు. ఏడా­ది­కి  5 వేల మంది టీ­చ­ర్లు, స్కూ­ల్ లీ­డ­ర్ల­ను తీ­ర్చి­ది­ద్దే­లా శి­క్షణ ఇవ్వ­ను­న్న­ట్టు ఆగ­స్త్య వి­ద్యా­చ­ల్ అకా­డ­మీ ప్ర­తి­ని­ధు­లు తె­లి­పా­రు. అనం­త­రం అకా­డ­మీ ప్రా­గం­ణం­లో­నే లె­ర్న­ర్స్ అకా­మి­డే­ష­న్ ఫె­సి­లి­టీ సెం­ట­ర్‌­కు చం­ద్ర­బా­బు శం­కు­స్థా­పన చే­శా­రు. ‘ప్ర­పంచ వ్యా­ప్తం­గా మా­రు­తు­న్న పరి­ణా­మా­ల­ను వి­ద్యా­ర్థు­లు అం­ది­పు­చ్చు­కో­వా­లి. అలా అం­ది­పు­చ్చు­కో­వ­డం వల్లే ఐటీ రం­గం­లో ప్ర­పంచ వ్యా­ప్తం­గా తె­లు­గు వా­ళ్లు వి­స్త­రిం­చా­రు. అప్ప­ట్లో ఐటీ­ని ప్ర­మో­ట్ చే­శా­ను.. ఇప్పు­డు ఏఐ గు­రిం­చి అం­ద­రూ ఆలో­చన చే­యా­ల­ని చె­బు­తు­న్నా. వి­ద్యా­ర్థు­లు ఆలో­చ­నా వి­ధా­నా­న్ని మా­ర్చు­కో­వా­లి.. భవి­ష్య­త్ మనదే. అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags:    

Similar News