Sonia Gandhi : సోనియాకు మళ్లీ ఈడీ నోటీసులు..
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి.;
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. జున్ 7న మొదటి సారి ఈడీ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే సోనియా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండడంతో విచారణని ఈడీ వాయిదా వేసింది. మళ్లీ నెల తరువాత నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈడీ విచారణకు హాజరుకావాలని సోనియాకు ఆదేశించింది.
ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని 51 గంటల పాటు ఈడీ విచారించింది. కోల్‌కతాకు చెందిన డోటెక్స్ కంపెనీ నుంచి అయిన లావాదేవీలకు సంబంధించి రాహుల్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.