Rahul Gandhi: దాదాపు ఆరు గంటల పాటు రాహుల్‌గాంధీని విచారించిన ఈడీ..

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో రాహుల్‌గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుధీర్ఘంగా విచారించింది.

Update: 2022-06-13 16:15 GMT

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుధీర్ఘంగా విచారించింది. 7 గంటలగు పైగా సాగిన విచారణలో రాహుల్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం పదకొండు గంటలకు రాహుల్.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పదకొండున్నర గంటలకు డిప్యూటీ డైరెక్టర్‌ పర్యవేక్షణలో రాహుల్‌ను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నించింది.

ఉదయం 3 గంటల పాటు విచారించిన ఈడీ.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చింది. ఈడీ కార్యాలయం నుంచి నేరుగా గంగారాం ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స పొందుతున్న తల్లి సోనియాగాంధీని కలిశారు. భోజన విరామం తర్వాత ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్‌ను తిరిగి అధికారులు ప్రశ్నించారు.

ప్రధానంగా యంగ్‌ ఇండియాతో రాహుల్‌కున్న సంబంధాలేంటి..? నేషనల్‌ హెరాల్డ్‌లో ఆస్తుల బదలాయింపు ఎలా జరిగింది? ఏజేఎల్‌ నుంచి యంగ్‌ ఇండియాకు ఆస్తుల బదలాయింపు ఎలా జరిగింది? అనే కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. పీఎంఎల్‌ఏ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారం రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు.

Tags:    

Similar News