Rahul Gandhi: ఐదోరోజు రాహుల్‌ను విచారించిన ఈడీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..
Rahul Gandhi: హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని అరెస్టు చేస్తారా..? ఐదు రోజుల విచారణలో ఈడీ అధికారులు ఏం తేల్చారు.;
Rahul Gandhi: హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని అరెస్టు చేస్తారా..? ఐదు రోజుల విచారణలో ఈడీ అధికారులు ఏం తేల్చారు.. ఇవాళ రాత్రి కూడా విచారణకు రమ్మనడం వెనుక ఆంతర్యమేంటి..? ఇవాళ రాత్రి జరిగే విచారణ కీలకమని ఈడీ వర్గాలు చెప్తుండగా.. అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది.. ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది.. ఎప్పుడు ఏం జరుగుతో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.. ఇప్పటికే ఐదు రోజులుగా ఆయన్ను విచారిస్తున్న ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.. ఇవాళ ఉదయం నుంచి పది గంటలు రాహుల్‌ను ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చారు.. దీంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు.. అయితే, ఇవాళ రాత్రి కూడా రాహుల్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది.. ఇవాళ రాత్రి జరిగే విచారణ చాలా కీలకమైనదని ఈడీ వర్గాలు చెప్తున్నాయి.
మొత్తం ఈ ఐదు రోజుల్లో రాహుల్ గాంధీని దాదాపు 50 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.. అయితే, ఏ ప్రశ్నకూ రాహుల్ నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని ఈడీ వర్గాలు చెప్తున్నాయి.. అందువల్లనే విచారణ ఆలస్యం అవుతోందని అంటున్నాయి.. అయితే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈడీ విచారణ పేరుతో రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.. ఐదు రోజులుగా నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి.. అటు ఈడీ ఆఫీస్ దగ్గర సిచ్యుయేషన్ అలాగే ఉంది.. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో ఏదో జరగబోతోందనే చర్చ నడుస్తోంది.. అయితే, ఇవాళ రాత్రి జరిగే విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మరోవైపు ఈడీ విచారణపై ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.. తగ్గేదేలే అంటూ ట్వీట్ చేశారు.. ఈడీ తనను లొంగదీసుకోవాలని చూస్తోందని.. కానీ, తాను లొంగిపోయే వ్యక్తిని కాదని అన్నారు.. ఈడీ ఏం చేయాలనుకుంటోందో నాకు తెలుసంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు.. అటు రాహుల్ కామెంట్స్ నేపథ్యంలో ఇవాళ రాత్రి జరిగే విచారణపైనే అందరి చూపు ఉంది.