రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.5కే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించబోతున్నట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. నీటిపారుదల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందుల్ని తమ ప్రభుత్వం తొలగిస్తుందని అన్నారు. వచ్చే మూడేళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే రైతుల నుంచి సోలార్ విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, రోడ్లు లేవన్న ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు.