Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన , గల్ఫ్ దేశాలతో మోడీ టచ్‌లో ఉన్నారని వెల్లడి

సంయమనం పాటించాలన్న కేంద్ర మంత్రి

Update: 2026-03-09 06:30 GMT

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. సంయమనం పాటించాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్‌సభలో వివరణ ఇచ్చారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. అలాగే ఇరాన్‌లో కూడా వేలాది మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భద్రత క్షీణిస్తోందని వాపోయారు. విధ్వంసం ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు భారతీయ రాయబార కార్యాలయం పని చేస్తోందన్నారు. అర్మేనియాకు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

‘‘చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం అని విశ్వసిస్తున్నాం. ప్రధాని మోడీ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడారు. నేను ఈ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాను. మేము మా దౌత్య మార్గాల ద్వారా కూడా సంప్రదిస్తున్నాము. నేను ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చితో కూడా మాట్లాడాను. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఇరాన్ యుద్ధనౌక కొచ్చిలో డాక్ చేయబడింది. ఇరాన్ మమ్మల్ని అభ్యర్థించింది. అయోన్ కొచ్చిలో డాక్ చేయబడింది. సిబ్బంది భారతదేశంలో ఉన్నారు.’’ అని జైశంకర్ తెలిపారు.

Tags:    

Similar News