S Jaishankar: ఎస్. జైశంకర్‌ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు..

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు భద్రత పెంపు;

Update: 2025-05-14 02:15 GMT

 భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భారీ భద్రత పెంచినట్లు సమాచారం. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో Z-కేటగిరీ భద్రత కొనసాగుతుంది. 24 గంటలూ ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది.

అలాగే, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సహా సుమారు 25 మంది బీజేపీ నాయకులకు అదనపు భద్రత కల్పించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వీఐపీల భద్రతపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో మూడో అత్యున్నత స్థాయి భద్రత జడ్‌ కేటగిరీ. దీనిని అత్యంత కీలక వ్యక్తులకు, ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు కేటాయిస్తారు. ఈ కేటగిరిలో 22 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన 4 నుంచి 6 మంది కమాండోలు, స్థానిక పోలీసు సిబ్బంది ఉంటారు. కాగా, 2023, అక్టోబర్‌లో జై శంకర్‌ భద్రత స్థాయిని జడ్‌ కేటగిరీకి పెంచారు. అప్పటివరకు ఆయన వై కేటరిగీలో ఉండేవారు.

Tags:    

Similar News