Black Cobra: బతికున్న నల్లత్రాచుకు పూజలు, వీడియో వైరల్

పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 3.68 లక్షల లైక్ లు

Update: 2024-05-05 04:45 GMT

పామును చూడగానే చాలా మంది ఆమడ దూరం పరిగెడతారు.. ఇక బ్లాక్ కోబ్రా పడగ విప్పితే అంతే సంగతులు.. అలాంటిది ఓ కుటుంబం మాత్రం నల్ల తాచుకు ప్రత్యేక పూజలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ వీడియో సంబంధించిన విషయాలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో మాత్రం తెలియ రాలేదు. ఈ వీడియోని గమనించినట్లయితే ఈ పూజలు శివరాత్రి సందర్భంగా కుటుంబం సభ్యులందరూ కలిసి పాముకు పూజించినట్లు అర్థమవుతుంది. వీడియోలో వెడల్పుగా ఉన్న పాత్రలో పామును ఉంచి దాని చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని పూజలు చేస్తున్నారు. పక్కనే ఓ అర్చకుడు కూడా మంత్రాలు చదువుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యం. పూజా కార్యక్రమంలో భాగంగా పాము పై నెమ్మదిగా పాలు పోసారు కుటుంబ సభ్యులు. అయితే ఆ సమయంలో పాము పడక విప్పి కోపంగా అందరి వైపు చూసింది. ఆయన గాని వారు ఎటువంటి బయాందోళనకు లోనవకుండా పూజలను కానిచ్చారు.

ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. నాగ పంచమి లాంటి పండుగలకు భక్తులు పాములకు ప్రత్యేక పూజలు చేస్తుంటారని చెప్పాడు. పుట్టల్లో పాలు పోయడం లాంటివి చేస్తుంటారని గుర్తుచేశాడు.

హిందూ సంప్రదాయం ప్రకారం శివుడు నాగదేవతకు ఉన్న ఓ ప్రాధాన్యత సంతరించుకోవడంతో నాగపంచమి లాంటి పండుగలకు దేశంలోని భక్తులు చాలామంది పాములను ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా చాలామంది పుట్టలలో పాలు పోయడం, లేకపోతే విగ్రహాల మీద పాలుపోవడం చేస్తుంటారు. కాకపోతే., ఇలా నేరుగా పూజలు చేయడం నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Tags:    

Similar News