జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఫ్యాషన్ షో చిచ్చు రేపింది. పవిత్ర రంజా టన్ మాసం వేళ జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో జరిగిన ఫ్యాషన్ షో వివాదాస్పదంగా మారింది. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఈ వివాదం గందరగోళాన్ని రేకెత్తించింది. సీఎం ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు రాజకీయ నాయకులు ఆ ఫ్యాషన్ షోను ఖండించారు. ఇదొక 'అశ్లీల' కార్యక్రమమన్న నేతలు.. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందన్నారు. సభ ప్రారంభం కాగానే.. అధికార నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఈ అంశాన్ని లేవెనత్తారు. ప్రజలు రోజంతా రంజాన్ పాటిస్తున్నప్పుడు అలాంటి ఉపవాసాలు కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.