UP PCS ఇంటర్వ్యూకు ముందు రోజే తండ్రి గుండెపోటుతో మృతి.. అయినా

కొడుకు ఆనంద్ విజయం తరువాత, తల్లి మాయా దేవి చాలా విచారంగా ఉందని, ఆనంద్ తండ్రి ఈ ప్రపంచంలో ఉండి ఉంటే, అతను చాలా సంతోషంగా ఉండేవాడని చెప్పింది.;

Update: 2024-01-24 09:52 GMT

కొడుకు ఆనంద్ విజయం తరువాత, తల్లి మాయా దేవి చాలా విచారంగా ఉందని, ఆనంద్ తండ్రి ఈ ప్రపంచంలో ఉండి ఉంటే, అతను చాలా సంతోషంగా ఉండేవాడని చెప్పింది. నా కొడుకు తన తండ్రి చూపిన బాటలో పయనించి ఈ విజయం సాధించాడు అని కన్నీళ్లతో కొడుకుని హత్తుకుంది.

ఉత్తరప్రదేశ్ PCS 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు వెలువడిన తర్వాత విజయం సాధించిన అభ్యర్థుల పోరాట కథనాలు తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగానే UP PCS 2023 పరీక్షలో 30వ ర్యాంక్ సాధించిన బండాకు చెందిన ఆనంద్ సింగ్ రాజ్‌పుత్ అనే ఉత్తమ విద్యార్థి కథ ఇది. అతని విజయం అతని కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది, అయితే అతని ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరిచింది.

వాస్తవానికి, ఆనంద్ సింగ్ రాజ్‌పుత్ ఇంటర్వ్యూకి ఒక రోజు ముందు, అతని తండ్రి గుండెపోటుతో మరణించాడు. కొడుకు UPSC పరీక్షలో విజయం సాధించడం ద్వారా అతనికి నిజమైన నివాళి అర్పించాడు. తన విజయాన్ని చూడడానికి తండ్రి లేడని కన్నీరు మున్నీరవుతున్నాడు. అయినా తనను తాను నియంత్రించుకుని ఇంటర్వ్యూలో విజయం సాధించి తన తండ్రి కలను నెరవేర్చాడు. తండ్రి చూపిన బాటలో పయనించి విజయం సాధించాడు కానీ నేడు కొడుకు విజయాన్ని చూసేందుకు తండ్రి లేడు అని అమ్మ ఆనందబాష్పాలు కారుస్తోంది.

తండ్రి యూపీ పీసీఎస్‌కు మార్గం చూపారు

ఇంటర్వ్యూకు ఒకరోజు ముందు తండ్రి గుండెపోటుతో మరణించాడు. సమాచారం రాగానే ఎలా ఇంటర్వ్యూకి హాజరవ్వాలని అనిపించింది. నా కాళ్ల కింద నేల జారిపోయిందని, నా నాలుక తడబడిందని, కన్నీళ్లు ఆపుకోవడం కష్టమైందని ఆనంద్ చెప్పాడు. కానీ కుటుంబం ధైర్యం ఇచ్చింది, ఇలాంటి అవకాశం అందరికీ రాదు.. ఎంతో కష్టపడి పరీక్ష పాసయ్యావు.. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా విజయం సాధిస్తావు.. అదే నువ్వు తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని కుటుంబసభ్యులందరూ అతడికి ధైర్యం చెప్పి పంపించారు.

గుండెల నిండా భాధతోనే ఇంటర్వ్యూలో కూర్చున్నాడు.. కానీ తన బాధను, దు:ఖాన్ని మొహంలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ తడబడకుండా సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూ చేసిన వారందరినీ మెప్పించగలిగాడు.. ఆపై ఇంటికి వచ్చి తండ్రికి అంత్యక్రియలు చేసాడు.

ఆనంద్ తన విద్యాభ్యాసం అంతా బండాలోనే చేశాడు. ఆ తర్వాత అతను ఢిల్లీలో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తన అంకితభావం, కృషి కారణంగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఆనంద్ తన గురువులకు, తన తల్లితండ్రులకు విజయాన్ని అందించాడు.

ఆనంద్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. పాత పేపర్లు చదువుతూ ప్రిపేర్ అవ్వాలి, బేసిక్ బుక్స్ చదవాలి, రిపీట్ చేస్తూ ఉండాలి, ఇంకా చాలా సవాళ్లు ఉంటాయని చెప్పాడు. ప్రారంభం కష్టంగానే ఉంటుంది. ప్రిపరేషన్ సాగుతున్నప్పుడు, ఇష్టంతో పాటు, విశ్వాసం కూడా వస్తుంది.. దాంతోనే విజయం వరిస్తుంది అని చెప్పాడు. 

Tags:    

Similar News