Cheetah Death: ఆగని చీతాల మరణాలు

మధ్యప్రదేశ్‌ కునో జాతీయ పార్కులో అయిదు నెలల వ్యవధిలో తొమ్మిదో చీతా మృతి.... మిగిలిన చీతాలను నిశితంగా పరిశీలిస్తున్న సిబ్బంది;

Update: 2023-08-03 01:15 GMT

 మధ్యప్రదేశ్‌ కునో జాతీయ పార్కు(Kuno National Park )లో చీతాల మరణాలకు తెరపడడంలేదు. తాజాగా మరో చీతా(Female Cheetah) మృతిచెందింది. ధాత్రి('Dhatri' ) అనే పేరు గల ఆడ చీతా ప్రాణాలు కోల్పోయిందని(Female Cheetah Found Dead) కునో పార్క్ అధికారులు వెల్లడించారు. చీతా మృతికి కారణాలు పోస్టుమార్టం( post-mortem) అనంతరం తెలుస్తాయని చెప్పారు. ధాత్రి అనే ఆడ చీతా మరణించినట్లు మధ్యప్రదేశ్‌( Madhya Pradesh) అటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది చీతాలు( 9th Death Since March ) మరణించాయి. దేశంలో చీతాల సంఖ్యను వృద్ధి చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామాలు ఆటంకంగా నిలుస్తున్నాయి.


ప్రాజెక్టు చీతా(Project Cheetah )’లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాల(20 cheetahs were imported from South Africa)ను భారత్ కు రప్పించారు. వాటిలో ధాత్రితో కలిపి ఆరు మృతి చెందాయి. కునో పార్కులో ఇంకా 14 చీతాలు( 14 cheetahs) ఉన్నాయి. వాటిలో ఏడు మగవి( seven males) కాగా, ఆరు ఆడవి(six females), ఒక ఆడ చీతా పిల్ల ఉంది. వాటిని ఎన్ క్లోజర్ లో ఉంచి పరిరక్షిస్తున్నారు. ఒక ఆడ చీతాను ఎన్ క్లోజర్ నుంచి బయటకు వదిలి నిశితంగా పరిశీలిస్తున్నారు. దానిని తిరిగి ఎన్ క్లోజర్ లోకి తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలనుచేయనున్నట్లు అటవీశాఖ అధికారులు వివరించారు.

రేడియో కాలర్‌ వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆరు చీతాల రేడియో కాలర్లను తొలగించారు. చీతాల కదలికలను పసిగట్టేందుకు వీలుగా వాటి మెడకు రేడియో కాలర్లను అమర్చారు. అయితే, వాటి వల్ల చీతాలకు గాయాలైనట్లు అధికారులు గుర్తించారు. ఇకపై వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్‌ బదులు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


చీతాలు వరుసగా మృతి చెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్‌కు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగేది ఇదేనంటూ వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి గర్వం, వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద పీట వేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు.. భారత్‌లో 74 ఏళ్ల క్రితమే కనుమరుగైపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మొదటి విడత కింద గతేడాది ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు. 

Tags:    

Similar News