Kerala Monkey Pox : తొలి మంకీ పాక్స్ కేసు.. తొలి మంకీ పాక్స్ మృతి కేసు అక్కడే..

Kerala Monkey Pox : కేరళలో తొలి మంకీ పాక్స్ మృతి కేసు నమోదైంది.;

Update: 2022-07-31 15:30 GMT

Kerala Monkey Pox : కేరళలో తొలి మంకీ పాక్స్ మృతి కేసు నమోదైంది. మంకీపాక్స్‌తో చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు కేరళ మంత్రి వెల్లడించారు. మంకీపాక్స్‌ మృతి కేసు నమోదుతో కేరళ ప్రభుత్వ అలర్ట్ అయ్యింది. మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది. మంకీపాక్స్ వ్యాధికో ఇప్పటికే కేరళలో ఐదు జిల్లాలు హై అలర్ట్‌తో ఉన్నాయి.

తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్టా, అలప్పీ, కొట్టాయం జిల్లాల్లో అప్రమత్తం ప్రకటించారు. తొలుత మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో చాలామంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి చెందినవారే. కనీస లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News