Double Decker Bus: రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు.. దేశంలోనే మొదటిసారి..

Double Decker Bus: దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు రోడెక్కింది.

Update: 2022-08-18 15:30 GMT

Double Decker Bus: దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు రోడెక్కింది. మొట్టమొదటి డబుల్‌ డెక్కర్‌ బస్సును దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. అనంతరం డబుల్‌ డెక్కర్‌లో ప్రయాణించారు. దేశంలోనే తొలిఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సుతో సహా రెండు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వర్యంలో సేవలందించనున్నాయి.

స్విచ్‌ మొబిలిటీ దేశీయంగా తయారు చేసిన EiV 22 బస్సు నగర రవాణాకు అనువుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సులు యూకే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే భారత్‌లోని ప్రధానగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.కాగా ఇప్పటికే బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 200 బస్సులను ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది.

EiV 22 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో అధునాతన సాంకేతిక సదుపాయాలు కల్పించారు. 231 కిలోవాట్స్‌ ఫర్‌ అవర్‌ కెపాసిటీ కలిగిన పవరింగ్‌ స్విచ్‌... లిక్విడ్‌ కూల్డ్‌, హై డెన్సిటీ ఎన్‌ఎంసీ బ్యాటరీ ప్యాక్‌, డ్యూయల్‌ గన్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌ కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం ఈ బస్సు ప్రత్యేకత. కాగా.. హైదరాబాద్‌లో కూడా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News