Omicron death: ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. ఎక్కడంటే..?
Omicron death: ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.;
Omicron death: ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో పాటు అందులో చాలావరకు కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రస్తుతం దేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా ఒమిక్రాన్ వల్ల ఇండియాలో ఒక్క మరణం కూడా లేకపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. కానీ ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదయ్యింది.
రాజస్థాన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ప్రస్తుతం దేశంలో 2,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారిలో కూడా రికవరీ రేట్ బాగానే ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికి 828 ఒమిక్రాన్ పేషెంట్స్.. వైరస్ నుండి బయటపడ్డారని వారు అన్నారు.
ప్రస్తుతం దేశంలోని 24 రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉన్నాయి. అందులోనూ మహారాష్ట్ర, ఢిల్లీలోని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 653 కరోనా కేసులు ఉండగా ఢిల్లీలో 464 మంది కరోనా బారిన పడ్డారు. రాజస్థాన్‌లో 174 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య మాత్రమే. అందులో రాజస్థాన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం కూడా నమోదవ్వడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.