Monkeypox In India: కేరళలో మంకీపాక్స్ కేసు.. ఆ అయిదు జిల్లాలు అలర్ట్..

Monkeypox In India: దేశంలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది.

Update: 2022-07-16 02:55 GMT

Monkeypox In India: దేశంలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేరళలోని కొల్లాంకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ అని తేలిన తర్వాత కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను టెస్ట్ చేశారు వైద్యులు. ఇక ప్రభుత్వం కూడా కేరళలోని ఆ అయిదు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇక కేంద్ర ఆరోగ్యశాఖ కూడా మంకీపాక్స్ కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని తెలిపింది. జంతు సంబంధిత ఆహార పదార్థాలను పక్కనబెట్టాలని సూచించింది. మంకీఫాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నా.. వైరస్ లక్షణాలు కన్పించినా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.

కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్టా, అలప్పీ, కొట్టాయం జిల్లాలు ప్రస్తుతం హై అలర్ట్‌లో ఉన్నాయి. ఎందుకంటే మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో చాలామంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి చెందినవారే. ఆ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండాలని, కనీస లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆదేశాలు జారీ చేసింది కేరళ ప్రభుత్వం.

Tags:    

Similar News