పంజాబ్ లో వరదలు.. 41 మంది మృతి

ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు.. పొంగుతున్న నదులు. జనజీవనం అస్థవ్యస్థంగా మారింది.

Update: 2023-07-26 09:32 GMT

ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు.. పొంగుతున్న నదులు. జనజీవనం అస్థవ్యస్థంగా మారింది.వరద తాకిడికి కొండచరియలు విరిగిపడడంతో కొందరు, కొట్టుకుపోయి కొందరు మృతి చెందుతున్నారు. వేల మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పంజాబ్ లో కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంది.

వరదల కారణంగా 41 మంది మరణించగా, 1,616 మంది 173 సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. పంతొమ్మిది జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వం, రెస్క్యూ ఏజెన్సీలు 27,286 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పంజాబ్ మరియు హర్యానాలోని పలు జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోజువారీ జీవనం స్తంభించిపోయింది. నివాస మరియు వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి.

వరదల బారిన పడిన మొత్తం 595 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ తెలిపారు. రూప్‌నగర్‌, ఎస్‌ఎఎస్‌ నగర్‌, పాటియాలా, సంగ్రూర్‌ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) మౌలిక సదుపాయాలకు కూడా గణనీయమైన నష్టాన్ని కలిగించాయని ఆయన చెప్పారు.

దాదాపు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 66 కెవి సబ్‌స్టేషన్లు నీటమునిగి, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. 

Tags:    

Similar News