PM Cabinet Meeting : జమిలి ఎన్నికలే ఫోకస్.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం

Update: 2024-12-12 12:30 GMT

ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వన్ నేషన్..వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోన్న టైంలో కేబినెట్ మీటింగ్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జమిలి ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపగా.. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. 

Tags:    

Similar News