Bihar Elections 2025: రాజకీయాలకు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు గుడ్ బై

ఓటమి తర్వాత ఫ్యామిలీలో లుకలుకలు.

Update: 2025-11-16 00:45 GMT

బీహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబంలో కలహాలు బయటపడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని, తన కుటుంబాన్ని వదిలేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సంజయ్ యాదవ్, రమీజ్‌ ఒత్తిడి వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రోహిణి ప్రకటన తర్వాత ఆర్జేడీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది తమ కుటుంబ అంతర్గత విషయమని పేర్కొంది. ఇదిలాఉండగా లూలూ కుటుంబం, ఆర్జేడీ మధ్య చీలిక పరిణామం ఇప్పటిది కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్ కూడా ఇప్పటికే పార్టీని, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. లాలూ యాదవే స్వయంగా ఆయన్ని బహిష్కరించాడు. ఆ తర్వాత తేజ్‌ప్రతాప్.. ఎన్నికలకు ముందు జనశక్తి జనతాదళ్‌ అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. అయితే మహువా స్థానం నుంచి బరిలోకి దిగిన తేజ్‌ప్రతాప్‌ ఓడిపోయారు.

ఇదిలాఉండగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. అందులో ఆర్జేడీ 25 స్థానాల్లోనే విజయం సాధించింది. తేజస్వీ యాదవ్‌ ఈసారి తామే అధికారంలోకి వస్తామని నమ్మకం పెట్టుకున్నప్పటికీ అది ఫలించలేదు.

 

Tags:    

Similar News