Ajay Kumar Bhalla: మణిపూర్ గవర్నర్‌గా మాజీ హోం సెక్రటరీ

అజయ్ కుమార్ భల్లా నియామకం ..;

Update: 2024-12-24 23:45 GMT

మణిపూర్ గవర్నర్‌గా మాజీ హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా నియమితులైనట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. మే 2003 నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న జాతి హింస నేపథ్యంలో భల్లా నియామకం జరిగింది. ఇదే విధంగా మిజోరాం గవర్నర్‌గా ఉన్న డాక్టర్ హరిబాబు కంభంపాటిని ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. విజయ్ కుమార్ సింగ్(వీకే సింగ్) మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్‌గా, కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీహర్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఈ ఏడాది జూలైలో మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య స్థానంలో అజయ్ భల్లా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కి అక్కడి పినరయి విజయన్ సర్కార్‌కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన మార్పు కూడా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News