కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో పంజాబ్ రాజధాని ఛండీగఢ్‌లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని రైతు సంఘం నేతలు కోరారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం ఉద్రిక్తంగా మారింది. అన్నదాతలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. వాటర్‌కెనాన్‌లు ఉపయోగించి అడ్డుకున్నారు.
అటు... ఆందోళనలో పాల్గొనేందుకు బయల్దేరిన శిరోమణి అకాలీదళ్ నాయకురాలు, ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌ను ఛండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఛండీగఢ్ జిరక్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆమె ట్విట్టర్‌లో మండిపడ్డారు. "రైతుల కోసం గళం విప్పినందుకు అరెస్టు చేశారు. కానీ వారు మమ్మల్ని అణచలేరు. మేం సత్య మార్గాన్ని అనుసరిస్తున్నాం" అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.