తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు యువ ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఆ నలుగురు ఎంపీల వయసు 25 ఏళ్లు మాత్రమే ఉంది. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు.
శాంభవి చౌదరీ.. బీహార్ నుంచి విక్టరీ సాధించారు.నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అశోక్ చౌదరీ కుమార్తె ఆమె. సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి శాంభవి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై ఆమె విక్టరీ కొట్టారు. సన్నీ హజారి కూడా ఓ మంత్రి కుమారుడు. ఎన్డీఏ ప్రచారం సమయంలో.. శాంభవి యువ అభ్యర్థి అని ప్రధాని మోదీ కొనియాడారు.
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నియోజకవర్గం నుంచి సంజనా జాతవ్ విజయం సాధించారు. ఆమె వయసు 25 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ ఖేడీ చేతిలో 409 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. కప్తాన్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
పుష్పేంద్ర సరోజ్ అనే వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశారు. కౌషాంబి పార్లమెంటరీ సీటుకు ఆయన పోటీపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో పుష్పేంద్ర విజయం సాధించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూపీ మాజీ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడే పుష్పేంద్ర. మచ్చిలిషార్ నియోజకవర్గం నుంచి ప్రియా సరోజ్ సుమారు 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.బీజేపీ ఎంపీ బోలానాథ్‌పై ఆమె గెలుపొందారు.మూడు సార్లు ఎంపీగా గెలిచిన తూఫానీ సరోజ్ కుమార్తే ప్రియా సరోజ్.