PMGKAY: ఐటీ చెల్లిస్తే ఉచిత రేషన్ కట్! కేంద్రం కీలక నిర్ణయం
అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు;
ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉచిత రేషన్ పొందుతున్న వారికి షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేసిన కేంద్రం.. ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని యోచిస్తోంది.
లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదంటే పాన్ నంబర్ వివరాలను వినియోగదారుల మంత్రిత్వశాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్‌పీడీ).. ఆదాయపు పన్ను శాఖకు అందిస్తుంది. వారిలో ఎంతమంది ఐటీ కడుతున్నదీ లెక్క తేల్చి తిరిగి ఆ వివరాలను డీఎఫ్‌పీడీకి అందిస్తుంది. ఈ వివరాల ద్వారా లబ్ధిదారుని ఆర్థిక స్థాయిని నిర్ధారించి వారు అర్హులో, కాదో తేలుస్తారు. అనర్హులు అయితే కనుక ఉచిత రేషన్‌ను నిలిపివేస్తారు.
ఉచిత రేషన్ బియ్య పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజేకేఏవై) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ట్యాక్స్ చెల్లింపు దారులకు రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపు దారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. తద్వారా పన్నుచెల్లింపు దారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే.. వారిని అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం, ఉచిత రేషన్‌ను నిలిపి వేయనుంది.
ఆదాయపు పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేఏవై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది. అయితే పీఎంజేఏఏవైలో పన్ను చెల్లింపు దారులకు సైతం రేషన్ అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపు దారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకోనుంది.
దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిరు పేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్‌లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది.